తిహార్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్

SAKSHITHA NEWS

KTR Mulakhat with Kavitha in Tihar Jail

తిహార్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్

హైదరాబాద్:ఢిల్లీలోని తీహార్‌ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్ అయ్యారు.మర్యాదపూర్వకంగా కవితను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభ‌కోణం కేసులో కవితకు జ్యుడీషి యల్‌ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి రెండు వారాల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు చదువుకోవ డానికి తొమ్మిది పుస్తకాలు కావాలని కోర్టుని కోరగా.. అందుకు న్యాయస్థానం అనుమ‌తించింది.
తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. ఆమెను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు…


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page