SAKSHITHA NEWS

తిరుపతి మేయర్ సీటుపై కూటమి సర్కార్ ఫోకస్?

అమరావతి:
అప్పుడు ఓడాం.. ఇప్పుడు పవర్ లో ఉన్నాం.. దెబ్బకు దెబ్బ వైసీపీ అబ్బ అనాల్సిం దే.. ఇదే కసితో ఉంది కూటమి. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలను లైట్ తీసుకున్న టీడీపీ.. ఇప్పుడు ఒక్కో మున్సిపాలి టీ, కార్పొరేషన్, జెడ్పీలో జెండా పాతేందుకు పక్కా ప్లాన్ అమలు చేస్తోంది.

వస్తాం సర్ తీసుకోండి అంటున్నా.. అందరికీ కండువా కప్పేయడం లేదు. అవసరం ఉన్నా, వారి మద్ద తు తప్పనిసరి అయినా గతం సర్కార్ హయాంలో ఓవర్ చేసిన వారిని పక్కకు పెట్టేస్తోంది టీడీపీ. కడప జెడ్పీ పీఠంపై ఆపరేషన్ కంటిన్యూ చేస్తూనే తిరుపతి మేయర్ సీటుపై ఫోకస్ పెట్టింది సైకిల్ పార్టీ.

టీడీపీ, జనసేనలో చేరేం దుకు వైసీపీ కార్పొరేటర్లు రెడీ..?

అది మేయర్ పీఠమైనా.. మున్సిపల్ ఛైర్మన్ అయి నా.. జడ్పీ కుర్చీ అయినా మనదే అయి ఉండాలం టోంది కూటమి సర్కార్. ఓడిన కసితో పాగా వేసి మరీ తీసుకోవాలని ఫిక్స్ అయింది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అసలే లేవంటూ తిరుపతి కార్పొరేషన్‌లో అసలైన రాజకీయానికి తెరలేపింది.

తిరుపతి మేయర్‌ పదవి ప్రస్తుతం వైసీపీ చేతిలో ఉంది. డిప్యూటీ మేయర్ పీఠం ఖాళీ ఉంది. దీంతో కౌన్సిల్‌పై ఆధిపత్యం కోసం కూటమి నేతలు వ్యూహాత్మ కంగా పావులు కదుపుతు న్నారు. అందుకు తగ్గట్లుగా నే పెద్ద సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ- జన సేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు.


SAKSHITHA NEWS