KONDAKAL కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం
సాక్షిత శంకరపల్లి : కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవాన్ని జరుపుకున్నారు. అందులో భాగంగా పాఠశాలలో సుమారు 200 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీవనజ్యోతి మాట్లాడుతూ మొక్కలు మానవ మనుగడకు చాలా ముఖ్యమని భవిష్యత్తులో మొక్కలు లేకపోతే వాతావరణ కాలుష్యం పెరుగుతుందని, వాతావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలని విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి డి జీవనజ్యోతి, కొండకల్ పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య, ఉపాధ్యాయులు రఘునందన్ రెడ్డి, కృష్ణయ్య, అంజిరెడ్డి, కుసుమకుమారి, శ్రీనివాస్, జగదాంబ, జంగయ్య, హరికృష్ణ, మల్లేష్, కవ్వ గూడెం శ్రీను, ఇందిరాబాయి, రాధ, పంచాయతీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
KONDAKAL కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం
Related Posts
ఉండ్రుగొండను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి
SAKSHITHA NEWS ఉండ్రుగొండను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: చివ్వెంల మండలం ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయ కమిటీ…
అంబరాన్నంటిన కాకతీయ కమ్మ సంక్షేమ సంఘ వనభోజనం మహోత్సవాలు
SAKSHITHA NEWS అంబరాన్నంటిన కాకతీయ కమ్మ సంక్షేమ సంఘ వనభోజనం మహోత్సవాలు(నవంబర్ 10, సాక్షిత ప్రతినిధి కోదాడ) సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోఆధ్యాత్మికతకు ఐక్యతకు స్నేహభావాలకు కార్తీక మాస వనభోజన మహోత్సవాలు ప్రతీకలు అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు…