సాక్షిత ప్రతినిధి నకిరేకల్ : వైయస్సార్ టీపి అధ్యక్షురాలు వైయస్ షర్మిలని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్ము శోభ తీవ్రంగా ఖండించారు.
గత 8సంవత్సరాల కాలంలో కేసీఆర్ అవినీతి పాలనను ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా ప్రశ్నించని సందర్భంలో షర్మిల తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి నేనున్నానంటూ ధైర్యంతో ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా నిరుద్యోగుల పక్షాన ప్రతి నిరుద్యోగ దీక్ష చేసి నిరుద్యోగులకు అండగా నిలబడ్డారు, అదే విధంగా షర్మిల పార్టీ స్థాపించిన నాటి నుండి అనేక రకాలుగా తెలంగాణ ప్రజలకు మద్దతుగా నిలుస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. షర్మిల కి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక కేసీఆర్ షర్మిల ని పదేపదే అరెస్టు చేయించడం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై నిరసనగా టీఎస్పీఎస్ కార్యాలయానికి బయలుదేరిన షర్మిల ను మధ్యలోనే అరెస్టు చేయడం జరిగింది ఇదేవిధంగా గత పది రోజుల్లోనే షర్మిల ని సుమారు మూడుసార్లు అరెస్టు చేయడం జరిగింది. ఒక మహిళ నేత, అది కూడా ప్రజల పక్షాన కొట్లాడే ప్రజా నాయకురాలిని ఈ విధంగా ప్రతిసారి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి కూని చేయడమే అవుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు.