
King Nadeva (Isaiah) I will glorify you :- Pastor Hosanna

రాజువైన నాదేవా (యేసయ్య) నిన్ను ఘనపరచెదను :- పాస్టర్ హోషన్న
విజయనగరం జిల్లా నెలిమర్ల వల్లూరు గ్రామంలోని బిలీవర్స్ ఈస్ట్రన్ చర్చ్ లో బుధవారం రాత్రి “గ్రాండ్ క్రిస్మస్” వేడుకలను ఘనంగా నిర్వహించారు.చర్చ్ పాస్టర్ నగిరి హోషన్న భక్తులకు దైవ సందేశాన్ని అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మచిలీపట్నం నుంచి వాక్యపోదేశకలు సాల్మన్ రాజు హాజరై మాట్లాడారు…
ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన ఏసుక్రీస్తును ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవనాన్ని గడపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పిల్లలు నిర్వహించిన నృత్యాలు చూపరులందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేసి అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ కాపరులు,క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు.
