SAKSHITHA NEWS

KD is a huge film produced by KVN Production, a well-known production company in Bangalore

image 31

బెంగళూరులో ఘనంగా ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ భారీ చిత్రం కేడీ – ది డెవిల్ టైటిల్ టీజర్ లాంచింగ్ ఈవెంట్

ప్రస్తుతం దేశంలో కన్నడ ఇండస్ట్రీ, కన్నడ సినిమాలకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. కేజీయఫ్, ఛార్లీ 777, విక్రాంత్ రోణ, కాంతారా సినిమాలతో కన్నడ ఇండస్ట్రీ దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు ఈ ఐదు చిత్రాలతో 1851 కోట్లు కొల్లగొట్టి దేశంలో నెంబర్ వన్ ఇండస్ట్రీగా కన్నడ పరిశ్రమ దూసుకుపోతోంది.

కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఆడియెన్స్‌ను అలరిస్తోంది. ప్రస్తుతం నాలుగో సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ను బెంగళూరులో ఘనంగా నిర్వహించింది. దేశంలో మొదటి సారిగా ఇలా ఓ సినిమా ఈవెంట్‌ను నిర్వహించారు.

బాలీవుడ్, శాండిల్ వుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు హాజరైన ఈ ఈవెంట్‌ను బెంగళూరులోని ఓరియన్‌ మాల్‌లో నిర్వహించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, కన్నడ స్టార్ హీరోయ ధృవ్ సర్జా, డైరెక్టర్ షో మ్యాన్ ప్రేమ్స్, నిర్మాత కేవీఎన్, బిజినెస్ హెడ్ సుప్రిత్, కన్నడ నటి రక్షిత, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా వంటి వారు పాల్గొని టైటిల్ టీజర్‌ను లాంచ్ చేశారు.

కన్నడ, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ సూపర్ స్టార్‌ల వాయిస్ ఓవర్లతో ఈ టైటిల్ టీజర్ ఉండటం విశేషం. కన్నడలో డైరెక్టర్ ప్రేమ్, హిందీలో సంజయ్ దత్, తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో మోహన్ లాల్ వాయిస్ ఓవర్ అందించారు. ఇలాంటి ఓ అరుదైన ఘటన ఇంత వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది వరకు ఎన్నడూ జరగలేదు. ఈ టైటిల్ టీజర్ చూస్తుంటే.. మరోసారి కన్నడ నుంచి మంచి పాన్ ఇండియన్ సినిమా రాబోతోన్నట్టుగా అర్థమవుతోంది. విజువల్స్, మ్యూజిక్ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

డైరెక్టర్ ప్రేమ్ మాట్లాడుతూ.. ‘ఎక్కడైతే మంచి ఉంటుందో.. అక్కడే చెడు కూడా ఉంటుంది. ఉదాహరణకు రాముడు ఉన్న చోటే రావణుడు కూడా ఉన్నాడు.. ఇదే ఈ సినిమా లైన్. ఈ సినిమా ఏమీ పూర్తిగా యాక్షన్ చిత్రం కాదు. ఇందులో రొమాంటిక్ లైన్‌తో పాటు.. సందేశం కూడా ఉంటుంది. కేజీయఫ్, పుష్ఫల కంటే భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

హీరో ధృవ్ సర్జా మాట్లాడుతూ.. ‘సంజయ్ దత్ గారు లెజెండరీ నటులు. కేడీ టీజర్ చాలా భయంకరంగా, విజువల్‌గా ఎంతో గ్రాండ్‌గా అనిపించినా ఇది ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా దగ్గరవుతుంది. ఆడియెన్స్‌కు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది’ అని అన్నారు.

సంజయ్ దత్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. కేవీఎన్ ప్రొడక్షన్‌కు ఆల్ ది బెస్ట్. ఇక ముందు కూడా నేను మరిన్ని సౌత్ సినిమాల్లో నటిస్తానని అనిపిస్తోంది. ప్రేమ్ సర్, కేవీఎన్ ప్రొడక్షన్‌కు థాంక్స్. ఈ టీజర్‌ను అందరూ ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

నటి, దర్శకుడు ప్రేమ్ భార్య రక్షిత మాట్లాడుతూ.. ‘ సంజయ్ దత్ సర్ లేకుండా ఈ ఈవెంట్ సంపూర్ణంగా అనిపించదు. మిస్టర్ అనిల్ తడానీ అందించిన సాయం మరువలేనిది. ధృవ్ సర్జాకు ఈ చిత్రం మరో ఆరంభంలా అవుతుంది’ అని అన్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్ బిజినెస్ హెడ్ సుప్రిత్ మాట్లాడుతూ.. ‘కంటెంట్ పరంగా ఈ చిత్రం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ప్రేమ్ సర్ ఈ సినిమాను హై స్థాయిలో ప్లాన్ చేశారు. ఆయన తెరకెక్కించే ప్రతీ సినిమా మీద మంచి క్రేజ్ ఏర్పడుతుంటుంది. ధృవ్ సర్జా కంటే డెడికెటెడ్ యాక్టర్‌ను మేం చూడలేదు’ అని అన్నారు.

కన్నడలో ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తుండగా.. హిందీలో AA ఫిల్మ్స్ బ్యానర్ మీద అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. ‘వారాహి చలన చిత్రం’ బ్యానర్ మీద తెలుగులో సాయి కొర్రపాటి  రిలీజ్ చేస్తున్నారు. ‘రెడ్ గెయింట్ మూవీస్’ మీద తమిళంలో రిలీజ్ ఉధయనిధి స్టాలిన్ రిలీజ్ చేస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ మీద మలయాళంలో ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరంబవూర్ విడుదల చేస్తున్నారు.

కేడీ టైటిల్ టీజర్‌లో మరో కొత్త ప్రపంచాన్ని చూపించారు. యాక్షన్ ప్రిన్స్ ధృవ్ సర్జాను క్రూరుడైన కాళీ పాత్రలో కనిపించారు. ఈ పాత్రకు సంబంధించిన లుక్‌ను ఇందులో చూపించారు. ఇందులో చూపించిన విజువల్స్, యాక్షన్ సెటప్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. టీజర్‌కు అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది


SAKSHITHA NEWS