JUSTICE ప్రజా ప్రభుత్వం లో పేద ప్రజలకు న్యాయం చేయాలి
- కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు మార్చుకోవాలి
- సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి
సాక్షిత కమలాపూర్ :
జిల్లా వ్యాప్తంగా రెండు సంవత్సరాల క్రితం నుండి ఇళ్ల స్థలాలు పక్కా ఇల్లు నిర్మించుట కోసం, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంచాలని సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటాలు కొనసాగుతున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అన్నారు. కమలాపూర్ ఎమ్మార్వో కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వేలాది మంది నిరుపేదలు బడుగు బలహీన వర్గాల కు చెందిన ప్రజలు ప్రభుత్వ భూములలో వేసుకొని గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని అధికారులకు ప్రజా ప్రతినిధులకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం లో అనేకసార్లు విన్నవించినా కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల స్థలాలు పక్కా ఇల్లు నిర్మించుటకై ఆర్థిక సహాయం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణి చేస్తామని హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి తెలిపారు. కేంద్రంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమ లు నిరుద్యోగులకు ఉపాధి కల్పించుటకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఏద్దేవా చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పగించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.లక్షలాది కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు రాయితీల పేరు మీద అప్పగిస్తున్నారని అన్నారు. ఇటీవల బొగ్గు గనులు వేలం వేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనడం సిగ్గు చేటని ఈ ప్రాంతంలో సింగరేణి సంస్థ ద్వారా వేలాదిమందికి జీవనోపాధి కలిగిన సంస్థలను నిర్వీర్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పగించడం ఈ ప్రాంత ప్రజల పైన తీవ్ర నిర్లక్ష్యం తో కూడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రజలను దృష్టిలో పెట్టుకొని సింగరేణి సంస్థకు బొగ్గు గనులు వేలం వేయకుండా సింగరేణి సంస్థ కే కట్టబెట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆదరి శ్రీనివాస్ ఏఐటి యు సి ప్రధాన జిల్లా కార్యదర్శి జక్కు రాజు గౌడ్, జిల్లా నాయకులు ధర్మల రామ్మూర్తి, సీపీఐ మండల కార్యదర్శి నకిర్తి ఓదెలు, నాయకులు కొలుగూరి బాలరా,జ్ శంకర్, జేరిపోతుల లచ్చన్న, బొజ్జ లక్ష్మి, శిరీష తదితరులు పాల్గొన్నారు.