Journalist’s issues petition to Andhra Pradesh Press Academy Chairman Kommineni Srinivasa Rao
ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు జర్నలిస్టుల సమస్యల వినతిపత్రం ఏపీడబ్ల్యూజేఎఫ్
సాక్షిత నంద్యాల జిల్లా
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ రావు నంద్యాల పర్యటనలో భాగంగా జర్నలిజం డిపార్ట్మెంట్ కోర్స్ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ క్లాసులు ప్రారంభించేందుకు నంద్యాల చేరుకోవడంతో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నంద్యాల నాయకులు అధ్యక్షులు శ్రీనివాసులు, అధ్యక్షులు శివ, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్, ఉపాధ్యక్షులు యలనాటి జాషువా ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఆ రంగుల మధు కుమార్, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో సత్కరించారు అనంతరం కొమ్మినేని శ్రీనివాస్ రావు కి నంద్యాల జర్నలిస్టుల సమస్యలు వివరించారు
అనంతరం రాష్ట్రంలో జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ రావు దృష్టికి తీసుకొచ్చారు జర్నలిస్టులపై విధించిన నిబంధనలను సడలించాలని అదేవిధంగా ప్రతి జర్నలిస్టుకు నివాస గృహాలు నిర్మించాలని జర్నలిస్టు పిల్లలకు కార్పొరేట్ విద్య ఉచితంగా అందించాలని,చిన్న పెద్ద పత్రికలకు అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని అలాగే ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ కు వినతిపత్రం సమర్పించారు అనంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తనపరిధిలో ఉన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు