ప్రజాపంథా రాష్ట కార్యదర్శి కామ్రేడ్ డి.వి.కె కు జోహార్లు : కొత్తపల్లి శివకుమార్ .
సాక్షిత న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి : నేటి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పంథాని రూపు దిద్దిన ప్రజాపంథా రూపాకర్త కామ్రేడ్ దుర్గంపూడి వెంకటకృష్ణారెడ్డి డివికే 2వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ అతివాద, మితవాద, పిడివాద రాజకీయాలను వ్యతిరేకిస్తూ అనేక ఇబ్బందులను అధిగమించి అనేక సవాళ్లకు దీటుగా సమాధానం ఇస్తూ విమర్శించే వారిని ఆలోచించేలా నూతన విప్లవ పంధాని రచించిన మహోన్నత విప్లవకారుడని అన్నారు.
నేటి భారతదేశంలో అతివాద ,మితవాద, పిడివాద సిద్ధాంతాలతో విప్లవాన్ని సాధించలేరని భారతదేశం విభిన్న సంస్కృతుల, సాంప్రదాయాలతోటి మిగతా దేశాలకు భిన్నంగా ఉంటుంది అన్నారు.
ఇక్కడ కేవలం ప్రజల్లోకి మార్క్సిజాన్ని తీసుకెళ్లి,విప్లవ పంథాతో ప్రజల్లో చైతన్యం నింపేలా చేసి,ప్రజాయుద్ధ పంథా ద్వారా ప్రజలను చైతన్యపరిచి, సాయుదులుగా మలచి రాజ్యంపై యుద్ధం చేసేలా తయారు చేయడమే అసలైన విప్లవ మార్గమని అదే ప్రజాపంథా దిశా నిర్దేశమని అన్నారు.
నూతన ప్రజాతంత్ర విప్లవం సాధించాలంటే ప్రజలకు దూరంగా ఉంటూ వివిధ పేర్లతోటి విప్లవాన్ని సాధించడం కష్టమని,ప్రజాపంథానే భారత దేశంలో సరైన విప్లవ మార్గమని విప్లవానికి దిశా నిర్దేశమని చాటి చెప్పి ఆచరణలో చూపిన మహోన్నత విప్లవ రూపశిల్పి కామ్రేడ్ డీవికె అని అన్నారు.
కామ్రేడ్ డివికె ఆశయాలను, ఆలోచనను ప్రజాయుద్ధ పంథాని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను విప్లవం వైపు మళ్లించి ఈ దోపిడీ పాలనపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉన్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్, పిడమర్తి లింగన్న, ఐఎఫ్టియూ జిల్లా సహయ కార్యదర్శి వీరబాబు, కోశాధికారి వాజిద్, గులాం హుస్సేన్,ఉపేందర్, సైదులు, మల్లన్న,నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.