
జనసేన ప్రస్థానంలో మరిచిపోని రోజు జనసేన యువ నాయకులు మండలనేని చరణ్‌తేజ
జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు, గాజు గుర్తు రిజర్వ్‌పై హర్షం
చిలకలూరిపేట:
కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన ను గుర్తిస్తూ జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేయడం శుభసూచికమని, పార్టీ ప్రస్థానంలో కీలక పరిణామని జనసేన యువనాయకులు మండలనేని చరణ్‌తేజబుధవారం చెప్పారు. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు, గాజు గుర్తు రిజర్వ్ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు జనసేన ఓ రాజకీయపార్టీఎన్నికల తర్వాత ఆపార్టీ ఓ శక్తిగా మారిందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ తరగని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ, నిరుపేదల ఆశా కిరణం లా జనసేన నిలించిందన్నారు.
పోటీచేసిన అన్ని శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొంది యావత్తు దేశం దృష్టిని ఆకర్షించిందని, మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి నేషనల్ ఇమేజ్ సొంతం చేసుకున్న జనసేనాని ప్రధాని మోడీ ప్రశంసలు అందుకున్నారని చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ఉండదని, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారంటూ ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసినా రాజకీయాలపై అవగాహన పెంచుకుంటూ సరైన వ్యూహాంతో ముందకు సాగారని గుర్తు చేశారు. వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలపై, లోపాలను ప్రశ్నిస్తూ జనసేన పార్టీ ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుందన్నారు.
