నాలుగేళ్లుగా జాబ్ కేలండర్ ఇవ్వని ప్రభుత్వం.
◆జగన్ పాలన లో రాష్ట్రంలో యువత పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది.
◆ఉపాధి లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
◆ఇప్పటివరకు ఒక్క డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్ట్ భర్తీ చేయలేదు.
◆ నైపుణ్య అభివృద్ధి సంస్థను నిర్వీర్యం చేశారు.
◆తెదేపా ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలను వెళ్లగొట్టారు.
◆యువతకు సబ్సిడీ రుణాలను ఎగ్గొటారు.
◆నిరుద్యోగ భృతి రద్దు చేశారు.
◆కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా ఏమైంది?
◆ఫేక్ ప్రకటనలతో మోసం చేస్తున్న జగన్ ప్రభుత్వం.
అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జనవరి 1 న జ్యాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్బాలు పలికిన జగన్ రెడ్డి నిరుద్యోగుల్ని నిలువునా మోసం చేశారని తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేక, రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాక, స్వయం ఉపాధికి ప్రభుత్వం నుంచి సహకారం లేక యువత భవిత ప్రశ్నార్ధకంగా మారిందని నూకసాని అన్నారు. ఉపాధి, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో గత మూడేళ్లలో 21,575 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పారన్న విషయాన్ని ఈ సం8నూకసాని గుర్తు చేశారు. C.M.I.E నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2019 ఏప్రిల్ నాటికి 4.0 శాతం ఉన్న నిరుద్యోగిత శాతం డిసెంబర్ 2022 నాటికి 7.7 శాతానికి పెరిగిందన్నారు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో పరిశ్రమల ద్వారా 5.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని నాటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డే అసెంబ్లీలో చెప్పారని నూకసాని అన్నారు. కానీ నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని నూకసాని డిమాండ్ చేశారు. కమీషన్ల కక్కుర్తితో మూడున్నరేళ్లలో 17 లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ర్టాలకు తరిమేసి 34 లక్షల మంది యువత ఉపాధికి గండి కొట్టారని నూకసాని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అమరావతి నిర్మాణంతో 15 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుడితే జగన్ అమరావతిని నిర్వీర్యం చేశారని నూకసాని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ హయాంలో 2 సార్లు డీఎస్సీ నిర్వహించి 18 వేల ఉద్యోగాలిచ్చాం. కానీ ప్రతి ఏటా మెగా డీఎస్సీ అన్న జగన్ రెడ్డి ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదని నూకసాని విమర్శించారు. ఐటి అభివృద్దితో 34 వేల ఉద్యోగాలు, స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా 64000 ఉద్యోగాలిచ్చాం. జగన్ ప్రభుత్వం ఐటి కంపెనీలు తరిమేసి, అక్రమ కేసులతో స్కిల్ డెవలప్ మెంట్ ని నిర్వీర్యం చేశారని నూకసాని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టులు ఇస్తానన్న జగన్ రెడ్డి ఎన్ని కాంట్రాక్టులిచ్చారు, ఎంతమందిని కాంట్రాక్టర్లుగా తయారు చేశారని నూకసాని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రతినెల 6 లక్షల మంది నిరుద్యోగ యువతకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి (ముఖ్యమంత్రి యువనేస్తం) ఇస్తే జగన్ దాన్ని రద్దు చేశారని అన్నారు. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పోరేషన్ల యువతకు సబ్బిడీ బ్యాంకు రుణాలతో స్వయం ఉపాది కల్పిస్తే జగన్ రద్దు చేసి నిరుద్యోగుల పొట్ట కొట్టారని నూకసాని విమర్శించారు. 25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచి సాధిస్తానన్న ప్రత్యేక హోదా ఏమైందని నూకసాని సూటిగా ప్రశ్నించారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో యువత గంజాయి, డ్రగ్స్ మద్యం వంటి వ్యవసనాలకు బానిసలుగా మారి జీవితాల్ని పాడు చేసుకుంటున్నారని నూకసాని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ పాలనలో గంజాయి అక్రమ రవాణాలో ఏపీ నెం.1 స్థానంలో ఉందని ఎన్సీబీ
నార్కోటిక్ కంట్రోట్ బ్యూరో నివేదిక చెబుతోందని, మరో వైపు 2021లో గంజాయి, మత్తు పధార్దాలకు బానిసలై ఏపీలో 571 మంది యువత
ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైంబ్యూరో) నివేదిక చెబుతోందని, వీటన్నింటికి కారణం జగన్ ప్రభుత్వ అసమర్థ, చేతకాని పాలనే అని నూకసాని విమర్శించారు. జగన్ ఇకనైనా యువతను మోసం చేయటం మాని వెంటనే ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని నూకసాని బాలాజీ డిమాండ్ చేశారు.