SAKSHITHA NEWS

[6:29 PM, 4/17/2023] Sakshitha News: జగనన్న మా భవిష్యత్తు
మాట మీద నిలబడే వ్యక్తి జగనన్న
కులం,మతం, ప్రాంతం, పార్టీ చూడడం”
అందరికీ అందుబాటులో ఉచిత వైద్యం
నగర మేయర్ డాక్టర్ శిరీష
జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ డాక్టర్ శిరీష


సాక్షిత : జగనన్నే మా భవిష్యత్” కార్యక్రమము 27 డివిజన్ పరిధిలోని పెద్ద కాపు వీధి లో సోమవారం ఉదయం కరపత్రాలను పంచుతూ అందరికీ సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయా, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యేందుకు మద్దతు ఇస్తారా అని తెలుసుకొని వారి స్పందనను నమోదు చేశారు. అనంతరం వారి అనుమతితో వారి ఇంటికి “జగనన్నే మా భవిష్యత్” స్టిక్కర్లను అతికించారు. మళ్ళీ సంక్షేమ సారధి జగన్ మెహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయాని లేని పక్షంలో ఆగిపోతాయాని అన్నారు.

మేయర్ మాట్లాడుతూ మాటమీద నిలబడే వ్యక్తిగా ఇప్పటికే జగనన్న, ఇచ్చిన హామీలు 98% నెరవేర్చాడు.
కులం,మతం, ప్రాంతం, పార్టీ చూడమని ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా చర్యలు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.
నాడు -నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను రూపురేఖలు మార్చిన ఘనత జగనన్నకే దక్కుతుందని అలాగే ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేయడం, ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. 3500 జబ్బులు కు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం అందిస్తున్నారని తెలియజేశారు.
జగనన్న విప్లవాత్మక వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను తెచ్చి, లబ్ధిదారులకు లేదా వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేస్తూ అవినీతికి తావు లేకుండా చేశారు.
అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా అండగా ఉంటున్నారు.
మరోసారి జగనన్నకు అండగా ఉంటామని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి.నాయకులు గోపాల్ రెడ్డి, చింతా భరణి, తులసి యాదవ్, ఈతమాకుల సురేష్, చింతా రమేష్, గజేంద్ర, సుధ యాదవ్, కార్యకర్తలు, వార్డు కన్వీనర్లు, గృహ సారుదులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS