ప్రకాశం జిల్లా,
పెద్ద దోర్నాల్లోని ఎంపీపీ స్కూల్లో మండల విద్యాశాఖ అధికారి మస్తాన్ నాయక్ ఆధ్వర్యంలో జగనన్న గోరుముద్దలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పాఠశాలలో రాగి జావఅందించే విధంగా, చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఈఓ మస్తాన్ నాయక్ తెలియజేశారు,మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక మాట్లాడుతూ రాగి జావా తాగటం వలన విద్యార్థులలోఐరన్ పొటాషియం, క్యాల్షియం కావలసినంత రాగిజావలో దొరుకుతుందని శారీరికంగా మానసికంగా ఉల్లాసంగా గడుపుతారని ఈ వేసవి కాలంలో రాగి జావ సేవించడం వలన పెద్దలలో,పిల్లలలో,శరీరంలోని ఉష్ణోగ్రతలు తగ్గించి శరీరం చల్లబరుస్తుంది అని తెలియజేశారు,
జగనన్న గోరుముద్దలో భాగంగా రాగిజావను పొందుపరిచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంఈఓ మస్తాన్ నాయక్, ఎంపీడీవోనాసర్ రెడ్డి,, ఉపాధ్యాయులు మందగిరి వర్ధన్, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ గంట వెంకటరమణారెడ్డి, జడ్పిటిసి లతా బాయి, మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక తదితరులు పాల్గొన్నారు.