సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన బారాస ఆవిర్భావ సభను ఖమ్మంలో పెట్టి, ఆర్భాటంగా ఖమ్మం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు రేపే ఇస్తున్నామని ప్రకటించినప్పటికీ, ఈనాటికీ కూడా ఆ స్థలం ఎక్కడ ఉన్నదో కనీసం జర్నలిస్టు మిత్రులకు కూడా తెలియకపోవడం విడ్డూరం. గొంతులేని ప్రజల గళాన్ని తమ కలం ద్వారా వినిపించే జర్నలిస్టులను మోసం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు అంటే అది కేసిఆర్ గారే అని బహుజన్ సమాజ్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇంచార్జ్ అయితగాని శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు.
ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జర్నలిస్టు మిత్రులకు ఇండ్ల పట్టాలిస్తామని ప్రకటించి ,నేడు అక్కడ కనీసంగా స్థలానికి హద్దులు కూడా నిర్ణయించని పరిస్థితి ఉందని తెలిపారు. దశాబ్ది ఉత్సవాలలో కాదు దశాబ్ది కాలం తర్వాత ఇండ్ల పట్టాలి ఇచ్చేలా ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. మొట్టమొదటి జీవో ఫిబ్రవరి 7 వ తారీఖున విడుదల చేసినప్పుడు కేవలం 5 ఎకరాల మాత్రమే జర్నలిస్టు మిత్రులకి కేటాయించడం జరిగింది. ఈ విషయంపై బహుజన్ సమాజ్ పార్టీ స్పందించి తీవ్రమైన నిరసన వ్యక్తం చేయడంతోనే వెంటనే ప్రభుత్వ స్పందించి దానిని 23 ఎకరాలకు పెంచడం జరిగిందని తెలిపారు,
నేడు బహుజన్ సమాజ్ పార్టీ కచ్చితంగా జర్నలిస్టు మిత్రులకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి నిరుపేదలైన జర్నలిస్టు మిత్రులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు