SAKSHITHA NEWS

దోషులను పట్టుకుని వాస్తవాలు వెలుగులోనికి తెస్తాం.

-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం,

జాతీయ నేతలను గౌరవించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు మన జాతి సంపద అని వసంత వెంకట కృష్ణ ప్రసాద్ . పేర్కొన్నారు.

ఇబ్రహీంపట్నం శక్తి నగర్ లో జాతీయ నేతల విగ్రహాలను కొందరు స్వల్పంగా ధ్వంసం చేసి, నష్టం కలిగించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ శక్తి నగర్లో వారిరువురు విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మన దేశ ఉన్నతి కోసం, సామాజిక సమానత్వం కోసం వారు ఎంతగానో పోరాడారని గుర్తు చేశారు. మహనీయుల విగ్రహాలకు నష్టం కలిగించే విధంగా ఎవరు వ్యవహరించారో, ఎందుకు వ్యవహరించారో, ఒకవేళ ఆకతాయిలు చేశారా? లేకపోతే ఉద్దేశపూర్వకంగా కావాలని ఎవరైనా చేశారా ? అనే విషయాలు పోలీసులు విచారణలో వెలుగు చూస్తాయన్నారు. వాస్తవాలు నిగ్గు తేల్చి దోషులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఇటువంటి ఘటనలో భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS