It is clear that the state of Telangana is advancing in the field of healthcare
సాక్షిత : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు , ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వైద్యారోగ్యరంగంలో దూసుకుపోతున్నదని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంత్రి హరీష్ రావు సూచన మేరకు ఎమ్మెల్యే బాలరాజు ప్రముఖ నటుడు సోనుసూద్ ను వెంట పెట్టుకొని అమీర్ పేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రిలో జరుగుతున్న నవీకరణ కార్యక్రమాలను పరిశీలించారు.
రెనోవేషన్ కార్యక్రమాలు చేపడుతున్న కాటేజ్ లు, భోజనశాల, యోగ ప్రాంగణం, ప్రకృతిని ఆస్వాదించేలా పరిసరాల నిర్వహణ, పేషెంట్ లకు అందించే డైట్, వైద్యుల ట్రీట్మెంట్ విధానాన్ని సూనూసుద్ ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, ఇతర వివరాలను ఉత్సాహంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రి హరీష్ రావు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలతో ప్రజల్లో వ్యక్తమవుతున్న సంతృప్తిని తాను గమనిస్తున్నానని సోనుసూద్ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గొప్ప ప్రగతిని కనబరుస్తున్న తీరును ప్రపంచం గమనిస్తున్నదని అన్నారు.
అనంతరం క్యాంపస్ ప్రధాన ద్వారం ముందు సోను సూద్ అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు , తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ (TSMSIDC) చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ తో కలిసి సంపంగి మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో ఆయుష్ కమిషనర్ శ్రీమతి ప్రశాంతి, నేచర్ క్యూర్ వైద్యులు, సిబ్బంది , టిఎస్ఎమ్ఎస్ఐడిసి సివిల్ విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.