SAKSHITHA NEWS

  • కోడి పందెములు నిర్వహించుట – పాల్గొనుట చట్టరీత్యా నేరం.

—- జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు —

కోడి పందెములు నిర్వహించుట – పాల్గొనుట చట్టరీత్యా నేరం అని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు.

స్థానిక క్యాంపు కార్యాలయంలోని కోడి పందెములు నిర్వహించుట – పాల్గొనుట చట్టరీత్యా నేరం అనే గోడపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోడి పందెములు నిర్వహించుట – పాల్గొనుట చట్టరీత్యా నేరం మని జీవ జంతు సంరక్షణ చట్టం సెక్షన్ 34/1960 మరియు సెక్షన్ 10/1974 ప్రకారం కోడి పందెములు నిర్వహించుట చట్టరీత్యా నేరం అన్నారు. అందులో పాల్గొన్నవారు గాని, ప్రోత్సహించిన వారు గాని ఏ స్థలములో నిర్వహిస్తారో వారికి కూడా వర్తిస్తుందన్నారు. కోడి పందెములు నిర్వహించినచో 144 సి ఆర్ పి సి ప్రకారం శిక్షార్హులని అన్నారు.

ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS