సాక్షిత ; బి ఆర్ ఎస్ పార్టీలో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయంలో గాజులరామారం డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నిన్న టిఆర్ఎస్ పార్టీలో సుమారు 200 మంది బిజెపి కార్యకర్తలు జాయిన్ అయ్యారని ఆ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో గాజులరామారం స్థానిక బిఆర్ఎస్ నాయకులు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో మరియు పత్రికలకు విడుదల చేయడం జరిగింది.
విషయానికొస్తే జాయిన్ అయిన వారు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని వ్యక్తులు, అంతేకాకుండా జాయిన్ అయిన వారిలో ముఖ్య నాయకుడు శ్యామ్ అనే వ్యక్తి 2022 జులై 24వ తారీఖున ఫేస్బుక్ ప్రొఫైల్ ఫోటో పెట్టుకున్న దాంట్లో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పార్టీ కండువా వేసుకొని ఉన్న ఫోటోని పెట్టుకోవడం జరిగింది. అంటే ఆల్రెడీ పార్టీలో ఉన్న సభ్యుని మళ్లీ ఆ పార్టీలోకి ఆహ్వానించుకొని దానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఫోటోలు వీడియోలు తీసి భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అయ్యారు అనిసోషల్ మీడియాలో మరియు ప్రింట్ మీడియాలో వేయించుకోవడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్నందుకు భయంతో స్థానిక ఎమ్మెల్యే ఇలాంటి చిల్లరి రాజకీయం చేయడం సిగ్గుచేటని మళ్లీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్ పాటిల్ , డివిజన్ ప్రధాన కార్యదర్శి జ్ఞాని ఈశ్వర్ , కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ ప్రజాదరణ కూలిపోయింది అనడానికి పూర్తి నిదర్శనం…
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS