SAKSHITHA NEWS

2024-25వ విద్యా సంవత్సరం లో కార్పోరేట్ కళాశాలల యందు ప్రవేశము పొందుటకు మార్చి -2024 లో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థిని /విద్యార్ధులు తేది 15.05.2024 నుండి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తునట్లు సూర్యాపేట జిల్లా షెడ్యుల్డ్ కులముల అభివృద్ధి అధికారి శ్రీమతి కె.లత ఒక ప్రకటనలో తెలిపారు. యస్.సి.యస్.టి.బి.సి., పి.హెచ్.సి మరియు మైనారిటీ విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in అంతర్జాలం ద్వారా సంబంధిత ధ్రువ పత్రాలతో దరఖాస్తులు చేసుకోవాలని తెలియజేశారు. ఈ అవకాశం మార్చి -2024 లో పదవ తరగతిలో ఉత్తీరులై జి.పి.ఏ.7.0 ఆ పైన జి.పి.ఏ. సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులు. ఇట్టి కార్పోరేట్ కళాశాలల్లో ప్రవేశానికి ప్రభుత్వ షెడ్యుల్డ్ కులముల వసతి గృహముల యందు వసతి పొంది ప్రభుత్వ పాఠశాలలో విద్యనబ్యాసించిన విద్యార్థిని /విద్యార్ధులు, మోడల్ స్కూల్, కేజీబీవి, ప్రభుత్వ, ఎయిడెడ్ . మున్సిపల్ జిల్లా పరిషత్, ప్రభుత్వ రెసిడెన్షియల్, జవహర్ నవోదయ విద్యాలయం, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల యందు చదివిన విద్యార్థిని /విద్యార్ధులకు కార్పోరేట్ కళాశాల యందు ఉచితంగా ప్రవేశం కల్పించాబడునని తెలిపారు. కావున ఆసక్తి కలిగిన మార్చి 2024లో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్ధిని / విద్యార్ధులు అన్ లైన్ ద్వారాదరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ముఖ్యమైన తేదీలు:-

దరఖాస్తులు అన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొనుటకుతేది 15.05.2024 నుండి తేది 30.05.2024 వరకు.

సెలక్షన్ లిస్ట్ 03.06.2024

ఎంపికైన విద్యార్ధుల ధ్రువ పత్రముల పరిశీలన, కళాశాలల అల్లాట్మెంట్ ఆర్డర్స్ పొందుట తేది 06.06.2024.

WhatsApp Image 2024 05 14 at 4.02.34 PM

SAKSHITHA NEWS