SAKSHITHA NEWS

[అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు
— నిందితుని వద్ద నుండి 35 తులాల బంగారం, అర కేజీ వెండి ఒక సెల్ ఫోన్ స్వాధీనం
— నిండితునిపై పలు స్టేషన్ లలో 300 కేసులు ఉన్నాయి – యస్ పి
— వివరాలను వెల్లడించిన యస్.పి అపూర్వ రావు
నల్లగొండ (సాక్షిత ప్రతినిధి)

అంతరాష్ట్ర కరడు కట్టిన దొంగను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అపూర్వరావు కేసు వివరాలను వెల్లడించారు. నల్గొండ 2 టౌన్ సిఐ, మరియు సి.సి.యస్ సిబ్బంది సంయుక్తంగా కలిసి నమ్మదగిన సమాచారం మేరకు పానగల్ ఇందిరాగాంధి చౌరస్తా వద్ద వెహికిల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండి పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీస్ వారు వెంబడించి పట్టుకొని చెక్ చేయగా అతని చేతిలో ఒక కవర్ లో బంగారు,వెండి ఆభరణాలు కలవు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను చెప్పిన వివరాల ప్రకారం నా పేరు శీలం శెట్టి వెంకటరమణ అలియాస్ శ్రీను తండ్రి నాగేశ్వర్ రావు(లేట్), వృత్తి ఆటొ డ్రైవరు, ప్రస్తుతం ఇస్తారకుల వ్యాపారం, నివాసం జనగాం, స్వస్థలం: రాజరాజేశ్వరి పేట, విజయవాడ అని తెల్పి మా నాన్న నాగేశ్వర్ రావు బ్రతికి ఉన్నప్పుడూ విజయవాడ లో రౌడీ షీటర్ చిన్న తనం నుండి మా నాన్న నన్ను దొంగతనం చేయమని కొట్టి బయటికి పంపగా నేను చిన్నతనం నుండి తాళాలు వేసి ఉండే ఇండ్ల లో దొంగతనాలు చేసి పలుమార్లు జైల్ కు వెళ్ళి వచ్చే వాడినని, విజయవాడ లో దొమ్మి కేసులు మరియు యాసిడ్ పోసిన కేసులు కూడ ఉన్నవి అని, తరువాత నేను విజయవాడ నుండి తణుకు వెళ్ళి అక్కడ స్క్రాప్ వ్యాపారం చేస్తూ తాడేపల్లి లో తాళాలు వేసిన ఇండ్ల ను ఎంచుకొని దొంగతనం చేసేవాడిని తరువాత తాడేపల్లి నుండి హైదరబాద్ కు వచ్చి బాల నగర్ లో ఉంటూ నేను అప్పుడు అప్పుడు విజయవాడ ,గుడివాడ ఏరియా లో వెళ్ళి దొంగతనం చేసి వచ్చేవాడిని ఆ తర్వాత విజయవాడ పోలీసు వారు వచ్చి నన్ను పట్టుకొని జైల్ కు పంపినారు.

2014 సం లో హైద్రాబాద్ పోలీసు వారి ఆద్వర్యం లో మైత్రి పోలీసు టిఫిన్ & టీ సెంటర్ ను 2019 వరకు నడిపామని ఆ సమయం లో రోడ్ వెడల్పు లో భాగంగా నా టిఫిన్ టీ సెంటర్ ను తీసివేసినారు. తక్కువ సమయములో ఎక్కువ డబ్బులు సంపాదించలని దురుద్దేశంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాలలో దొంగతనం చేసి దాచుకున్న బంగారు ఆభరణాలను గుంటూర్ లో అమ్మడానికి వెళ్ళుతున్నాని నేరం ఒప్పుకోగ ఇతని పైన నల్లగొండ 2 టౌన్ నందు 8 కేసులు, నల్గొండ 1టౌన్ నందు 3 కేసులు, నల్గొండ రూరల్ 1 కేసు, సూర్యాపేట 2 టౌన్ లో 1 కేసు, మొత్తం 13 కేసులు నమోదు చేసి రిమాండుకి పంపడం జరిగిందని యస్.పి తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా చేదించిన నల్లగొండ డి.యస్.పి నరసింహ రెడ్డి పర్యవేక్షణలో 2 టౌన్ సిఐ చంద్రశేఖర్, సి.సి.యస్ సి.ఐ లు జితేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, యస్. ఐ రాజశేఖర్ రెడ్డి ఏ.యస్.ఐ లింగా రెడ్డి,హెడ్ కానిస్టేబుల్స్ విష్ణు వర్దన్ గిరి,మోహిన్,లింగా రెడ్డి, శంశుద్దీన్ కానిస్టేబుల్ బాలకోటి లను జిల్లా యస్.పి అబినందించారు.


SAKSHITHA NEWS