
NSUI ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరాగాంధీ మెమోరియల్ మండల్ లెవెల్ పోటీలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని చింతల్ HMT గ్రౌండ్ లో NSUI రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గొల్ల జాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-17, అండర్-14 మండల స్థాయి కోకో- కబడ్డీ పోటీలు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ప్రారంభించారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ వశిష్ట విద్యాలయం మరియు నార్త్ సిటీ హై స్కూల్ ఇరు జట్ల మధ్య టాస్ గెలిచిన జట్టును అభినందించారు..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ… క్రీడా పోటీల ద్వారా విద్యార్థుల ఉత్సాహం పెరుగుతుంది.. అలాగే ఈ పోటీ సమాజంలో ప్రతి సమస్యను ఎదుర్కొనే ధైర్యం కలుగుతుందన్నారు…
ఈ కార్యక్రమంలో NSUI మాజీ ప్రధాన కార్యదర్శి గొల్ల జాన్ మరియు NSUI నాయకులు,యువజన నాయకులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు
