సికింద్రాబాద్ : స్వాతంత్ర ఫలితాలు ప్రజలందరికి దక్కేలా తమ వంతు కృషి చేస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.
సాక్షిత : సితాఫలమండీ క్యాంపు కార్యాలయం వద్ద “స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా ‘ఇంటింటీ కీ జండా లు ” అందించే కార్యక్రమాన్ని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 75 సంవత్సరాల ద్వి సప్తాహ వేడుకలు సికింద్రాబాద్ పరిధిలో ఘనంగా నిర్వహిస్తామని, ప్రజలను ఆయా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలనీ కార్పొరేటర్లు, నాయకులకు పిలుపునిచ్చారు. పాలనా యంత్రాంగం సైతం స్వాతంత్ర స్పూర్తిని ప్రజల్లో కలిగించేలా కృషి చేయాలనీ కోరారు. డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, శ్రీమతి కంది శైలజ, తెరాస యువ నేతలు శ్రీ కిశోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమీషనర్ శ్రీ దశరద్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ శ్రీనాద్, తెరస నేతలు మోతె శోభన్ రెడ్డి, శ్రీ లింగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సితాఫలమండీ లోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా జాతీయ జండాలను ప్రజలకు ప[పంపిణీ చేశారు. అంతకు ముందు స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాల నిర్వహణ పై అధికారులు, ప్రజా ప్రతినిధులతో పద్మారావు గౌడ్ ఓ సమావేశాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ పరిధిలో ఈ నెల 9వ తేదిన ఇంటింటికీ జాతీయ పతకాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి ఉత్సవాలకు శ్రీకారం. 10 వ తేదిన ఎంపిక చేసిన పార్కుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని, 11 వ తేదిన ఫ్రీడమ్ రన్, 12 న మీడియా ద్వారా కార్యక్రమాలు, 13 న వజ్రోత్సవ ర్యాలీ, 14 న సంస్కృతిక కార్యక్రమలు, 15 న పతకవిష్కరణలు, 16 న సాముహిక జాతీయ గీతాలాపన, 17 న రక్తదాన శిబిరాలు, 18న ఫ్రీడం కప్ పేరుతో క్రీడా పోటీలు, 19న దవాఖానలు, వృద్ధాశ్రమాలు.. అనాథ శరణాలయాల,ల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ,
20న దేశభక్తి, జాతీయ స్ఫూర్తి చాటేలా ముగ్గుల పోటీలు. 21న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం.
22న ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు విజయవంతంగా ఆయా డివిజన్ల వారీగా చేపట్టాలని అధికారులు, పార్టీ శ్రేణులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు.
స్వాతంత్ర ఫలితాలు ప్రజలందరికి దక్కేలా తమ వంతు కృషి చేస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…