సూర్యాపేటలో ‘సంగీత హాస్పిటల్’ ప్రారంభం
ముఖ్య అతిథిగా హాజరైన రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి
….
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : పట్టణంలోని ఎంజి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సంగీత హాస్పిటల్ ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణంలో ఆధునిక వైద్య సేవలు విస్తరించడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, కొత్తగా ప్రారంభమైన ఈ ఆసుపత్రి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి అంజద్ అలి, మున్సిపల్ కౌన్సిలర్లు గుణగంటి హేమ సతీష్, కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, షేక్ జహీర్, పిల్లల భవాని రమేష్, పిసిసి ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్, జిల్లా వాణిజ్య సెల్ చైర్మన్ కక్కిరెని శ్రీనివాస్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్, సేవాదళ్ చీఫ్ ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దెబోయిన శ్రీనివాస్, వాజిద్, రాచకొండ శ్రీనివాస్, దొంతిరెడ్డి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY