బంజారాల సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి
బర్మావత్ హరినాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
లక్ష్మిదేవిపల్లి మండలం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సేవాలాల్ సేన లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు బట్టు హుస్సేన్ నాయక్ ఏజెన్సీ పరిరక్షణ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టు అరుణ్ నాయక్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలోని బంజారా సంఘం కార్యాలయం ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బర్మావత్ హరినాయక్ రిబ్బన్ కట్ చేసి బంజారా సంఘం కార్యాలయం ప్రారంభించారు .
ఈ సందర్భంగా బర్మావత్ హరినాయక్ మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ మేరమ్మ యాడి తుల్జా భవాని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని బంజారాల సాంస్కృతి సాంప్రదాయాలను బంజారా సోదరులకు తెలియపరిచే విధంగా కృషి చేయాలని అన్నారు బంజారాల పండుగలైన తీజ్ పండగ సీతాల పండుగ విశేషాలు విశిష్టత గురించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న బంజారా సోదరులకు తెలియపరిచే విధంగా కృషి చేయాలని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రక్షణ చట్టాలను రక్షించుకోవలసిన బాధ్యత మనపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు లావుడియా ప్రసాద్ నాయక్ బోడ శ్రీను నాయక్ ఏజెన్సీ పరిరక్షణ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టు అరుణ్ నాయక్ రామచంద్రనాయక్ సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షులు బద్రు నాయక్ వెంకటేష్ నాయక్ ధారావత్ కృష్ణా నాయక్ బాలు నాయక్ చుంచుపల్లి మండల అధ్యక్షులు భూక్య రాంబాబు నాయక్ సుజాతనగర్ మండల అధ్యక్షులు ప్రసాద్ నాయక్ గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు