SAKSHITHA NEWS

శాస్త్రోక్త పూజలు నిర్వహించి మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని….

-అందరి సమస్యలు తీర్చే ప్రధమ పూజ్యుడి మండపాన్ని ప్రారంభించడం నా అదృష్టం….

-శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి….

గుడివాడ పట్టణం మెయిన్ రోడ్డులో వేంచేసియున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధర్మకర్తల కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసుకున్న దేవస్థాన కాలక్షేప మండప ప్రారంభోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి విశేష అభిషేకాలు చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని, శాస్త్రోక్త పూజలు నిర్వహించి కాలక్షేప మండపాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో విశిష్టత కలిగిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో కాలక్షేప మండప నిర్మాణానికి గత అనేక దశాబ్దాలుగా జరుగుతున్న ప్రయత్నాలు నేటికి నెరవేరాయన్నారు. ఏ మంచి కార్యక్రమం నిర్వహించాలన్న ప్రతి ఒక్కరు గణపతి పూజతో మొదలు పెడతారని, అలాంటిది స్వామివారి కాలక్షేప మండపం నా చేతుల మీదుగా ప్రారంభం కావడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే నాని అన్నారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు. ప్రభుత్వ సహకారం లేకపోయినా పూర్తిగా దాతల సహకారంతో 50 లక్షలతో మండప నిర్మాణాన్ని పూర్తిచేసిన ధర్మకర్తల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే కొడాలి నాని అభినందించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల భాస్కరరావు, దేవస్థాన చైర్మన్ గంటా చంద్రశేఖర్, సభ్యులు బంటుమిల్లి సూర్యనారాయణ, బొర్రా రవి కుమార్, సిద్దాబత్తుల నీలవేణి, ఆరేటి భారతి, కాకొల్లు రాధిక, తాత రజనీకుమారి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి,ఈఓలు V.D.D.ప్రసాద్, నటరాజన్ షణ్ముగం, జూనియర్ అసిస్టెంట్ వీరంకి శ్రీనివాసరావు, దేవస్థాన అర్చకులు కపిలవాయి గోపాల శాస్త్రి, సిబ్బంది జాలాది వెంకటనారాయణ, మాజీ కౌన్సిలర్లు జోగా సూర్య ప్రకాష్, వీరిశెట్టి నరసింహారావు, మాదాసు వెంకటలక్ష్మి, వైసిపి నాయకులు అగస్త్యరాజు కృష్ణమోహన్,అడపా పండు, వెంపటి సైమన్, రమణ కుమార్, చంద్రాల హరి రాంబాబు, పంచకర్ల వెంకట్, షేక్ బాజీ, భక్తులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 22 at 5.38.17 PM

SAKSHITHA NEWS