SAKSHITHA NEWS

పట్టించుకోని నాగర్ కర్నూల్ డీఎంహెచ్ఓ. ఇప్పటివరకు కూడా డిఎంహెచ్ఓపై చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్

సాక్షిత : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లోని ఆర్.ఎం.పి. డాక్టర్ల ఇష్టారాజ్యం. ప్రజల ప్రాణాలతో చెలగాటం. ఇదంతా నాగర్ కర్నూల్ డి ఎం హెచ్ కనుసైగల్ లో నడుస్తున్న పట్టించుకుని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్. కల్వకుర్తి పట్టణంలోని ఆర్.ఎం.పి హాస్పిటల్ ఆస్పత్రిల వారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా. నాగర్ కర్నూల్ డీఎంహెచ్ఓ పర్మిషన్ లు ఉన్నాయంటూ ప్రభుత్వం వారు నిర్ణయించిన నిబంధనలు పాటించకుండా ఆసుపత్రుల్లో వచ్చిన రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చీటికిమాటికి గుల్కోస్ లు ఎక్కించడం ఎక్కువ డోస్ లు ఉన్న మందులు రాస్తూ కల్వకుర్తిలోని మున్నాభాయ్ ఎంబిబిఎస్ లుచెలరేగిపోతున్నారు.

డబ్బు సంపాదనే లక్ష్యంగా వారి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆర్ఎంపీలు నిర్వహించే ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు లేక ఆసుపత్రులకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ నానా అవస్థలు పడుతున్నారు. జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళితే అదే అదునుగా భావించి డబ్బు సంపాదనే లక్ష్యం చేసుకొని చికిత్స అందిస్తున్నారు ఆర్ఎంపీ డాక్టర్లు. కనీసం వారు నిర్వహించే ఆసుపత్రిలో ఫ్యాన్స్ సౌకర్యం కూడా ఉండదు. రోగాల బారిన పడిన రోగులు ఆస్పత్రికి వస్తే ఏ రోగం వచ్చినా సరే అందరు రోగులని ఒకే దగ్గర పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. ఇలా ఒకే దగ్గర ఓకే తుప్పు పట్టిన మంచంపై పడుకోబెట్టి , ఒక వ్యక్తికి ఎక్కించాల్సిన సెలైన్ సెట్ తో ముగ్గురు రోగులకు సైలెన్సు ఎక్కిస్తున్నారు. చికిత్సలు అందించడంతో ఒకరికి సోకిన రోగం మరొకరికి సోకే అవకాశం ఉంటుంది. ఆర్.ఎం.పి లు నిర్వహించే ఆసుపత్రులు అపరిశుభ్రంగాఉన్నాయి.పరిశుభ్రంగా లేవు, మున్నాభాయ్ ఎంబిబిఎస్ కూర్చునే దగ్గర మాత్రం 24 గంటలు ఫ్యాన్ నడుస్తూ ఉంటుంది.

ఒక్కొక్క పేషంట్ కి మినిమం ఐదారు గ్లూకోజులు ఎక్కిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవేవీపట్టించుకోకుండా ఆర్ఎంపీ డాక్టర్లు వచ్చిన వారికి వచ్చి రాణి వైద్యంతో చికిత్సలు చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పూట గడవని స్థితిలో ఉన్న కుటుంబాలు ఆర్.ఎం.పి కల్వకుర్తిలోని ప్రైవేట్ మున్నాభాయ్ ఎంబీబీఎస్ ల దగ్గరకు వెళ్తున్నారు.నిరుపేదల అమాయకత్వాన్ని.అమాయకత్వాన్ని దానికి తోడు నిరక్షరాస్యతను ఆసరాగాఉపయోగించుకుని అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేస్తూ. ఒకే రోజు వీరి సంపాదన లక్షల్లో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చేసేది ఏమి లేక వారు రాసిన మందు చీటి తీసుకెళ్లి మెడికల్ షాప్ దగ్గర మందులు కొంటున్నారు

.

ఇంత జరుగుతుందంటే దీని వెనకాల నాగర్ కర్నూల్ డిఎంహెచ్ఓ హస్తం ఉందా? ఆర్ఎంపీలకు అనుమతులు ఉన్నాయా నిజంగానే డిఎంహెచ్ఓ ఇచ్చాడా? లేక కల్వకుర్తి పట్టణంలో పుట్టగొడుగుల అనుమతులులేనిమున్నాభాయ్ఎంబీబీఎస్ హాస్పిటల్లో అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా నడిపిస్తున్నారా? అని కల్వకుర్తి నియోజకవర్గప్రజలలోఅనుమానాలుకలుగుతున్నాయి.ఈవిషయంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కల్వకుర్తి పట్టణంలోని ఆర్ఎంపి డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకొని కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు.గతంలో ప్రైవేట్ ఆసుపత్రులపై తనిఖీలు నిర్వహించి తూతూ మంత్రంగా షాపులని సీజ్ చేశారు.

రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్న వారి ఆసుపత్రులను వదిలిపెట్టి చోటామోటా డాక్టర్ల ఆసుపత్రిలో సీజ్ చేసి చేతులుదులుపుకున్నారు. శరమాములే మళ్లీ అవే ఆస్పత్రులు సాయంత్రం మూతపడిన ఆసుపత్రులు ఉదయం లోగా తెర్చుకున్నాయి.డబ్బు అక్రమ సంపాదనే లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్న అనుమతులు లేని ఆసుపత్రులు కొనసాగిస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. ఇకనైనా అధికారులు అలసత్వం వహించకుండా పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని ఆసుపత్రులపై కొరడా జలిపించాల్సిందిగా ఆయా గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు.


SAKSHITHA NEWS