SAKSHITHA NEWS

In the post-production activities, the crime thriller Adharva..

image 62

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో క్రైం థిల్లర్ అధర్వ..   

పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో  తెరకెక్కుతున్న కొత్త సినిమా అధర్వ. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రానికి విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.  

ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేసి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగించేశారు మేకర్స్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఎంతో గ్రాండ్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై హైప్ తీసుకొచ్చారు. ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌  సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడమే గాక సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ కన్ఫమ్ చేయడంతో అందరి దృష్టి ఈ అధర్వ సినిమాపై పడింది.  

ఈ చిత్రంలో హీరో కార్తీక్ రాజు పవర్‌ఫుల్ రోల్‌ పోషిస్తుండగా.. సిమ్రాన్ చౌదరి, ఐరా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్,  గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మారిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమా డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల బాణీలు కట్టడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం మేజర్ అసెట్ కానుందని, చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ ప్రేక్షకులకు వినూత్న అనుభూతి కలిగిస్తుందని అంటున్నారు మేకర్స్. త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.      

టెక్నికల్ క్రూ:

రైటర్, డైరెక్టర్: మహేష్ రెడ్డి

ప్రొడ్యూసర్: సుభాష్ నూతలపాటి

బ్యానర్: పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ 

సమర్పణ: నూతలపాటి నరసింహం, అనసూయమ్మ

మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల

DOP: చరణ్ మాధవనేని 

ఎడిటింగ్: SB ఉద్ధవ్ 

ఆర్ట్: రామ్ కుమార్

లిరిక్స్: కాసర్ల శ్యామ్, కిట్టు విస్సప్రగడ 

PRO: సాయి సతీష్, పర్వతనేని


SAKSHITHA NEWS