రైతుభరోసా పేరిట సీఎం రేవంత్ అన్నదాతలకు చేసిన దారుణమైన దగాపై తెలిపిన చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతన్నలు.
ఏటా రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని ఏడాది పాటు ఊరించి ఊరించి చివరికి 12 వేలే ఇస్తామని ఉసురు తీసిన ముఖ్యమంత్రి మోసానికి నిరసనగా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతులతో కలిసి కాంగ్రెస్ హామీ పత్రాలను, రేవంత్ ఫ్లెక్సీని దహనం చేసే నిరసన తెలిపారు.
మాయ మాటలు చెప్పి రైతన్ననల ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చినాక మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ప్రతి ఒక్క రైతన్నకు ఎకరానికి 15000 చొప్పున రైతు భరోసాను అమలు చేసేవరకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటాం అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.