SAKSHITHA NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

అశ్వారావుపేట మండల

సాక్షిత న్యూస్

అశ్వరావుపేట ……పేరాయి గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో సరైన సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్న తరుణం వెలుగులోకి వచ్చింది పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదుల మేరకు స్థానిక ఎంపీటీసీలు వేముల భారతి సత్యవరపు తిరుమల పాఠశాలను సందర్శించగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వారికి వివరించారు. పాఠశాల పరిసరాలు ఏమాత్రం శుభ్రంగా ఉండడం లేదని తినే ఆహారంలో సైతం పురుగులు ఉండడంతో ఆందోళనకు గురవుతున్నామని దోమల తో కనీసం పడుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉందని పిల్లలు వా పోయారు వారి మాటలు విన్న ప్రజాప్రతినిధులు వెంటనే పరిసరాలను పరివేక్షించగా కుళ్లిపోయిన కూరగాయలతో వంట గదులు దర్శనమిచ్చాయి నాసిరకము కూరగాలతో కనీస శుభ్రత లేకుండా పిల్లలను ఇబ్బంది పెడుతూ మరోపక్క వారికీ మరుదొడ్ల విషయం లో కూడా శుభ్రత కనిపించక పోవడం నిజంగా వారిపై ప్రభుత్వం మరియు కాంట్రాక్టర్ లు చూపిస్తున్న వివక్ష అని వారు అన్నారు.

అసలే ఓ పక్క వర్ష కాలం కావడం తో అనేక రకాల వ్యాధులు రావడానికి ఈ పాఠశాల వాతావరణం పుస్కలంగా తొడవుతుందని అక్కడ చదువుకొనే విద్యార్థిని అరవతరగతి ఆశశ్రీ తల్లిదండ్రులు బయపడి టీసీ తీసుకోని వెళ్లిపోవడం కొసమెరుగు ఇక నైనా విద్యార్థికి లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నాం అనే చెప్పుకొనే తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలై ప్రత్యేక శ్రద్ద వహించి పిల్లలు ఉజ్వల భవిషత్తు కు తొడ్పాడాల్సిన బాధ్యత ఉందని వారు అన్నారు. ఈ పర్యవేక్షణ లో ఎంపీటీసీ లతో పాటు కాంగ్రెస్ యస్ సి సెల్ మహిళా నాయకులు, మరియమ్మ, రమాదేవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS