కోలా ఆనంద్ ను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్న బీజేపీ నేతలు
మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా సెక్రటరీ, అసెంబ్లీ పార్టీ కో – కన్వీనర్
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి , రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ సూచనలుతో శ్రీకాళహస్తి పట్టణంలోని చెంచులక్ష్మీ కాలనీ మరియు నియోజకవర్గం పరిధి నందు తొట్టంబేడు పంచాయతీలోని తొట్టంబేడు, గిరిజన కాలనీల్లో పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు మరియు మండల అధ్యక్షులు వేడం కృష్ణయ్య ఆధ్వర్యంలో బీజేపీ నేతలతో కలసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ శ్రీ కోలా ఆనంద్ ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా గెలుపు కోరుతూ ఇంటింటికీ వెళ్ళి శ్రీనరేంద్రమోదీ సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేయడమైనది. "కేంద్రానికి నరేంద్రమోదీ" కోసం - "శ్రీకాళహస్తికి కోలా ఆనంద్" కోసం "కమలం గుర్తుకే మన ఓటు" వేయడం వలన డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడి శ్రీకాళహస్తి నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి ఓటర్లను కోరారు.
డబుల్ ఇంజన్ సర్కారు వలన శ్రీకాళహస్తి నియోజకవర్గము అభివృద్ధిలోను, సంక్షేమంలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రగామిగా శ్రీకాళహస్తి ఏర్పడుతుందని అసెంబ్లీ కో - కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ, అసెంబ్లీ పార్టీ కో - కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్, పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు, తొట్టంబేడు మండల పార్టీ అధ్యక్షులు వేడం కృష్ణయ్య, సీనియర్ నాయకులు సొట్ట సుకుమార్, జీవి ఆమర్నాధ్, మండల ప్రధాన కార్యదర్శిలు మద్దు వాసు యాదవ్, పుణ్యం ఢీల్లీ కుమార్, ఉపాధ్యక్షులు లింగాబత్తిన గోపాల్, బొక్కిసం కిరణ్ మణి, ఓబీసీమోర్ఛా మోర్ఛా జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాలెం రవి అచ్చారి, పట్టణ ఓబీసీమోర్ఛా అధ్యక్షులు కన్నా వేంకటేశ్వర్లు, మండల కిసాన్ మోర్ఛా అధ్యక్షులు చొక్కాని రవిచంద్ర, మండల ఓబీసీమోర్ఛా అధ్యక్షులు పుచ్చకాయల రమేష్ యాదవ్, మండల యువమోర్చా అధ్యక్షులు తానికొండ్ల భరత్ కుమార్ నాయుడు, ప్రధాన కార్యదర్శి సురా బిందు కుమార్, షేక్ తుమ్మిల్లా ఖాన్, నండ్ర విద్యా సాగర్ తదితరులు పాల్గొన్నారు.