In India, Andhra Pradesh State Police Department is the top in good policing
భారత దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ గుడ్ పోలీసింగ్ లో అగ్రస్థానం లో నిలవడం అభినందనీయం.
సాక్షిత : ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. ఎపి రాష్ట్ర డిజిపి కెవి రాజేంధ్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో, మార్గదర్శకాలకు అనుగుణంగా పని చేయడంతో అరుదైన గౌరవం దక్కింది.
అభినందనలు తెల్పిన . జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్. సమర్థత పోలీసు శాఖ పై ప్రజల విశ్వాసం, విధుల్లో నిజాయితీ తదితర అంశాల పై అగ్రస్ధానంలో నిలవడం . జిల్లా పోలీసు యంత్రాంగానికి అభినందనలు.
అందించిన కృషి, సహాకారం మరువలేనిది.
భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి.
ఒక ఇండిపెండెంట్ సంస్థ చేసిన సర్వే ప్రకారం భారతదేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ గుడ్ పోలీసింగ్ లో ( సమర్థత, నిజాయితీ, విశ్వాసం) అగ్రస్ధానంలో నిలవడం సంతోషకరమని ఈ సంధర్బంగా కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగానికి కూడా జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ శనివారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.
జనవరి 20 నుండి 22 వరకు న్యూఢిల్లీలో 3 రోజుల పాటు ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన అన్ని రాష్ట్రాల డీజీపీ లతో పలు అంశా ల పై సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఒక ఇండిపెండెంట్ సంస్ధ చేసిన సర్వేలో పోలీసు శాఖ పై ప్రజల విశ్వాసం, సమర్ధత, నిజాయితీ కి సంబంధించిన అంశాల పై నిష్పక్షపాతంగా చేసిన సర్వే నివేదిక ను కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందన్నారు.
దేశంలోనే ఎపి పోలీసు శాఖ మొదటి స్ధానంలో నిలవడం గర్వకారమన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగానికి కూడా అభినందనలన్నారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. పోలీసు శాఖ పై ప్రజల విశ్వాసం, సమర్థత, నిజాయితీకి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే లో మొదటి 5 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రధమ స్థానం లో నిలిచిందన్నారు.
.
7 కోట్లు దిశ మొబైల్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్లు. 2) సాంకేతిక తో కూడిన ఖచ్చితమైన సాక్ష్యాధారాలు, నేర నిరూపణతో శిక్ష పడే విధంగా దర్యాప్తు 3) పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ 4) సాంకేతికత వినియోగం ద్వారా త్వరితగతిన పోలీసు ప్రతిస్పందన. 5) పోలీసులలో క్రమశిక్షణా విధానాన్ని పెంపొందించడం వంటి పలు అంశాల పై గత ఏడాది ఎపి పోలీసు శాఖ తీసుకున్న ప్రత్యేక చర్యల ద్వారా ఈ ఫలితం , అరుదైన గౌరవం దక్కిందన్నారు.
సర్వే ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి
పోలీసుశాఖ పై ప్రజల విశ్వాసం :
ఆంధ్రప్రదేశ్ 2. తమిళనాడు 3. తెలంగాణ 4. గుజరాత్ 5. ఢిల్లీ
సమర్థత :1. ఆంధ్రప్రదేశ్ 2. తెలంగాణ 3. గుజరాత్ 4. హిమాచల్ ప్రదేశ్ 5. జార్ఖండ్
నిజాయితీ :1. ఆంధ్రప్రదేశ్ 2. ఉత్తరాఖండ్ 3. తెలంగాణ 4. గుజరాత్ 5. ఢిల్లీ
ఈ ఫలితాలను సాధించడంలో జిల్లా పోలీసు యంత్రాంగానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.