సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎం టి హిల్స్ కమ్యూనిటీ కాలనీ లో షుమారు 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఓన్ ఫీట్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను జలమండలి అధికారులతో కలసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, భాగ్యనగర్ ఫేజ్ 3 నుండి హెచ్ ఎం టి హిల్స్ కమ్యూనిటీ కాలనీ లో నిర్మిస్తున్న ఓన్ ఫీట్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను పరిశీలించడం జరిగింది అని, అలానే డివిజన్ లో అన్ని ప్రాంతాల్లో వర్షాకాలం నాటికి డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మెరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం పొంగుతున్న ప్రాంతలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు.
ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ,కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలానే అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతానని, అదే విధంగా సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్య మంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో, ప్రభుత్వ విప్ గాంధీ ఆధ్వర్యంలో హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన,
అగ్రగామి డివిజన్‌గా తీర్చిదితామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ప్రశాంతి, సూపర్వైజర్ నరేంద్ర, భాగ్య నగర్ ఫేజ్ 3 కాలనీ వాసులు శ్రీధర్, జవహర్ బాబు, శివాజి, విజయ్, కృష్ణ, అరబ్, సందీప్, శైలేష్, వినోద్, అప్పలరాజు, హెచ్ ఎం టి కాలనీ వాసులు గాంధీ రావు, గోపి చంద్, కే ఎస్ అర్ మూర్తి, చక్రపాణి , జగదీష్ , మోహన్ సత్యనారాయణ, మల్లేశ్వర చారీ, రామచంద్ర రెడ్డి, జనార్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు.