సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపిజె) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్. ఖాసిమ్ ఆధ్వర్యం లో, స్థానిక అజీజ్ గల్లీలోని, జె.ఐ.హెచ్. ప్రధాన కార్యాలయం లో రంజాన్ మాసం సందర్భంగా, ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ట్రాఫిక్ ఏ.సి.పి. రామోజీ రమేష్ మాట్లాడుతూ,
కుల మతాలకు ప్రతీకగా రంజాన్ పర్వదిన మాసం ఉంటుందని, అత్యంత కఠోర దీక్షతో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేస్తుంటారని అన్నారు. ముస్లిం సోదరులు సూర్యోదయానికి ముందు నుంచి, సూర్యుడు అస్తమించే వరకు అన్న, పానీయాలు సేవించ కుండా దీక్షతో ఉండి, అల్లాను పూజించడం అభినందనీయమని అన్నారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఎం.డి. సాదిక్ అహ్మద్, ఎంపిజె సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ మాట్లాడుతూ, ముస్లిం లందరూ ఉపవాసం దైవభీతితో పాటిస్తూ, నిరుపేదలకు జకాత్ ను విధిగా చెల్లించాలని తెలిపారు.
ఎంపిజె జిల్లా అధ్యక్షులు షేక్. ఖాసిమ్ మాట్లాడుతూ, రంజాన్ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించింది, కావున కృతజ్ఞతలు తెలుపుతూ ముస్లిం లందరూ ఉపవాసములు పాటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు రంజాన్ మాసం పవిత్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ అంజలి, సిఐ అశోక్, లింగాల రవికుమార్, అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎం.పి.జె ఉపాధ్యక్షుడు గఫార్, ఎంపిజె జిల్లా కోశాధికారి ఎండి హకీమ్, ఎస్.ఐ.ఓ టౌన్ ప్రెసిడెంట్ ఎం.డి. ఒసామా, ఎంపీజె కార్యదర్శులు బి. సతీష్, ఎం.డి. జమీల్, ఎం.డి. రఫీక్, ఎం.డి. రజబాలి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి రమేష్, మీడియా సెక్రటరీ టి.ఎస్.చక్రవర్తి, వినోద్, అవోపా క్రిష్ణమూర్తి, భధ్రయ్య, సభ్యులు ముజాహిద్, అన్వర్, రఫీ, పాషా, ఖాజా మొహిద్దీన్, బియాబాని, ఖలీఖ్, గౌస్, రఫీ, అర్షీన్, హుస్సేన్ మియా తదితరులు పాల్గొన్నారు.