SAKSHITHA NEWS

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడుtraffic regulation

ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ ఎస్సై

గద్వాల టౌన్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు అన్నారు.ట్రాఫిక్ ఎస్సై ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ పై పట్టణం లోని సిఐ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్, పొల్యూషన్ లకు సంబంధించిన పత్రాలను ఖచ్చితంగా వెంటనే ఉంచుకోవాలని సూచించారు. రాంగ్ రూట్ లో వాహనాలను నడపొద్దని, నో పార్కింగ్ ఏరియాలో వాహనాలను నిలుపొద్దని, టేపు రికార్డులు వాడొద్దని, సడన్ గా ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా రోడ్డు పై వాహనాలను ఆపొద్దన్నారు.ఆర్సీ నెంబర్ ఖచ్చితంగా వేయించాలని, మైనర్లు వాహనాలను నడపొద్దన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, మద్యం సేవించి వాహనాలను నడపొద్దని వీటిలో ఏది అతిక్రమించినా నూతంగా ఏర్పడిన చట్టాలద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.నిబంధనలకు విరుద్ధంగా ఆటోలను నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. తమ వెనుక కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకుని ఆటోలు సురక్షితంగా నడుపుకోవాలన్నారు. లైసెన్స్‌లు తప్పకుండా తీసుకోవాలన్నారు. తాగి వాహనాలు నడపవద్దని,. ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం ఆటోలను నడపాలని, ఆటో రిజిస్ర్టేషన్‌ నెంబర్‌ కనబడేలా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు

traffic regulation

SAKSHITHA NEWS