బాపట్ల జిల్లా
ప్రశ్నిస్తేనే గుర్తింపు :కేసన
- కదలిరండి బీసీ గళం వినిపిద్దాం
- ఐక్యతతో పోరాడి హక్కులు సాధిద్దాం బీసీలకు అమలుపరచాల్సిన రిజర్వేషన్ పై పలు పోరాటాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగి వస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. బాపట్ల సాయి ప్యాలెస్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బీసీ రౌండ్ టేబుల్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వ సమయంలో చేసిన బీసీ కుల జనగణన ఇప్పుడు ఎందుకు చేయటం లేదని కేంద్రంలో తమ సంఘం ఎన్నో పోరాటాలతో ఒత్తిడి తెచ్చిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీహార్ లో బీసీ కుల జనగణన చేయటం సంతోషకరమన్నారు. అదే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ లో జరిపించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పటం శుభపరిణామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాలని సంకల్పిస్తే వాలంటరీ వ్యవస్థతో ఒక్కరోజులోనే బీసీ కులజనగణన చేసే సామర్థ్యం ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. ఏది ఏమైనా రానున్న ఎన్నికలలో బీసీల అవసరత రాజకీయ పార్టీలకు ఉందన్నారు.
- బీసీలు లేనిదే రానున్న ఎన్నికలలో విజయం ఎవరికీ సాధ్యం కాదని రాజకీయ పార్టీల ఆందోళన చెందుతున్నాయన్నారు. ఇప్పటికే తమ సంఘం అవసరతను అధికార, ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటున్నాయన్నారు. బీసీలే సమర్థవంతమైన పరిపాలన అందించటంతో సమాజాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బీసీ రాజ్యాధికారం దిశగానే తన ప్రణాళిక కొనసాగుతుందని, మీ అందరి పక్షాన నేను పోరాటం చేస్తున్నాను. నా నాయకత్వం ఇప్పటి వరకు బలపరిచినట్టు మరింతగా గ్రామస్థాయిలో సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు. దీనితో బీసీలకు భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందన్నారు. రాష్ట్ర రాజధానిలో పాదయాత్రతో రైతుల సమస్యలపై పోరాటం చేశామన్నారు. జంతర్ మంతర్ వద్ద ఎన్నో ధర్నాలు చేశామన్నారు.
- గల్లి నుంచి ఢిల్లీ వరకు తాము అలుపెరగని పోరాటం చేస్తున్నామని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మరి క్రాంతి కుమార్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి బీసీల చర్చ జరిపేందుకు రచ్చబండలు, పల్లెనిద్రల వేదిక చేసుకుని ఐక్య ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. బీసీ భవనం ఏర్పాటుకు స్థల సేకరణ చేశామని భవన నిర్మాణానికి అందరూ సహకారం అందించాలని కోరారు. ప్రతి జిల్లాలోని బీసీ భవన నిర్మాణాలు చేసి భవిష్యత్తు తరానికి పటిష్టమైన సంఘ నిర్మాణాన్ని అందించడానికి ప్రణాళిక దిద్దుతున్నామన్నారు. బీసీల సమస్యల పరిష్కారానికి తాము అలుపెరగని పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ బీసీల్లో ఎక్కువ వృత్తిదారులు ఉన్నారని వారి అభ్యున్నతకు నిధులు కేటాయింపుపై ప్రభుత్వాలు సరైన ప్రణాళికను ప్రకటించాలన్నారు.
- జిల్లా అధ్యక్షుడు జువ్వా శివరాం ప్రసాద్ మాట్లాడుతూ బీసీలపై దాడులు జరగటాన్ని ఖండిస్తూ వారికి రాజ్యాంగ భద్రత కల్పించే విధంగా అట్రాసిటీ చట్టాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు గుర్రం ద్వారక శ్రీను, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, యువ నాయకుడు కొల్లూరి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు మద్దిబోయిన తాతయ్య, బాపట్ల నియోజకవర్గ అధ్యక్షుడు పిన్నిబోయిన వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు మారం రవికుమార్, ఈడే శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సలహాదారుడు అంగలకుదురు నటరాజన్, వేమూరు నియోజకవర్గ అధ్యక్షుడు మురాల వాసుదేవ్, బాపట్ల నియోజకవర్గ యువజన అధ్యక్షుడు ఎన్ఎస్పి రాజు, బాపట్ల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవులు మహేష్, ధనుంజయ్, యువజన పట్టణ అధ్యక్షుడు ఉప్పలదిన్నె గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.