SAKSHITHA NEWS

I will definitely provide my support for the marriages of poor girls





పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తా – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి


సాక్షిత : గుమ్మడిదల మండలంలోని వీరన్న గూడెం గ్రామపంచాయతీ పరిధిలో షేక్ ముర్షిద్ పరిశ్రమలో డైలీ కూలిగా పెయింటింగ్ పనిచేసుకుంటూ ఇంటిని పోషించడం జరుగుతుంది. షేక్ ముర్షిద్ అంజూమ్ దంపతుల కూతురి వివాహానికి తనవంతుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఎట్టి పరిస్థితులలో ఏ పేద ఇల్లు కూడా ఆడపిల్ల పెళ్లి చేయడానికి బరువుగా భావించవద్దని తనవంతుగా సహాయ సహకారాలు ప్రతి పేద ఇంటి ఆడపడుచుకు అందిస్తానని తెలియజేశారు. గుమ్మడిదల మండల సోషల్ మీడియా అధ్యక్షుడు ఫయాజ్ షరీఫ్ ద్వారా ఈ యొక్క పేదింటి పెళ్లి విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వెంటనే తనయుడు గూడెం విక్రం రెడ్డి చే 15 వేల రూపాయలు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్వి అధ్యక్షుడు కానోజి రాము , వీరన్నగూడెం గ్రామపంచాయతీ మెంబర్ ఎజాస్ పాషా , నల్లవల్లి టిఆర్ఎస్వి అధ్యక్షుడు అరవింద్ గౌడ్ , గుమ్మడిదల టిఆర్ఎస్వి నాయకులు దీక్షిత్ , దినేష్ లతోపాటు అక్బర్ హుస్సేన్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS