మీ ఓటు అమ్మకానికి కాదు…నమ్మకానికి వేయమని అభ్యర్ధిస్తున్నాను.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .
స్థానిక ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
గతంలో రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం మాత్రమే పనిచేశారు తప్ప నగరాభివృద్ధి గురించి పట్టించుకోలేదు. కానీ మేము మాత్రం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే తిరుపతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
ఇందులో భాగంగానే 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 7ఫ్రీ లెఫ్ట్ లు ,5 స్లిప్ వే రోడ్లు, అలాగే నగర కూడళ్లను సుందరీకరించి అందమైన మెరుగులు దిద్దాం. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాడిగా ప్రతి సమస్యపై నాకు అవగాహన ఉంది. ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో కూడా తెలుసు. వీటన్నింటిని అధిగమించి రాష్ట్రంలోనే నెంబర్ వన్ సిటీగా మన తిరుపతిని నిలుపుతా అని మాట ఇస్తున్నాను.
వచ్చే ఐదేళ్లలో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి యువత వలస వెళ్లకుండా ఇక్కడే ఉపాధి పొందేలా చేస్తాను. ఇదంతా జరగాలంటే మీ అందరి మద్దతు నాకు అవసరం. రాబోయే ఎన్నికల్లో మీరు నాకు అండగా ఉంటే ఏదైనా సాధించగలుగుతా అని తెలియజేస్తున్నాను.