సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎం టి హిల్స్ లో రూ.43.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, హెచ్ ఎం టి హిల్స్ లో సిసి రొడ్డు నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది అని, అలానే అలాగే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. అదే విదంగా సిసి రోడ్డు పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్కు తగు సూచనలు చేసిన నార్నె శ్రీనివాసరావు . ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, దేవి, కాలనీ వాసులు గోపీచంద్, గాంధీ, కె యస్ ఆర్ మూర్తి, భాస్కర్, మోహన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎం టి హిల్స్ లో రూ.43.00 లక్షల రూపాయల అంచనా వ్యయం
Related Posts
ఆపదలో ఉన్నవారికి అపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్-
SAKSHITHA NEWS ఆపదలో ఉన్నవారికి అపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్-16,35,000 వేల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన……….. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి సాక్షిత వనపర్తి ఆపదలో ఉన్నవారికి సీఎం…
మానవత్వాన్ని చాటుకున్న రాణిగంజ్ డిపో డ్రైవర్లు, కండక్టర్లు..
SAKSHITHA NEWS మానవత్వాన్ని చాటుకున్న రాణిగంజ్ డిపో డ్రైవర్లు, కండక్టర్లు.. మల్కాజిగిరి రాణిగంజ్ డిపో లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ రషీద్ తోటి సిబ్బంది ఇబ్బందుల్లో ఉంటే అండగా ఉండాలని ఉద్దేశంతో, మానవసేవే మాధవసేవ అనే గ్రూప్ ని…