SAKSHITHA NEWS

సాక్షిత : అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎం టి హిల్స్ కాలనీ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు సెంటర్ ను ఆకస్మికంగా వెళ్లి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . మాట్లాడుతు మానవ అవయవాలలో అతి ప్రధాన అవయవం కన్ను అని, తెలంగాణలోని అంధత్వానికి గురైన అన్ని ప్రాంతాల ప్రజలకు, వారు ఎక్కడా నివసిస్తున్న, ఏమి చేస్తున్నా, ఏ కంటి సమస్య ఉన్న వారైనా నివారణ మార్గాలను,అత్యున్నత నాణ్యత గలిగిన వైద్యం ఖర్చు లేకుండా అందుబాటులోనికి తేవడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని, రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి వైద్యం అందుబాటులో నికి తీసుకురావడానికి కంటి వెలుగు ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగినది అని, కావున కంటి సమస్యలున్న వారు మన వద్ద ,మీ దగ్గరి పరిసర ప్రాంతాలలో ఉన్న కంటి పరీక్షా శిబిరంలో పాల్గొనాలని, ఇందులో ఉచితంగా కంటి పరీక్షలు, మందులు, కళ్ళద్దాలు ఇవ్వబడునని ఈ చక్కటి సదాఅవకాశంను ప్రతి ఒక్కరు సద్వినియోగ పర్చుకోవలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం దేశంలోనే గొప్ప పథకం అని, దేశానికే ఆదర్శవంతమైన పథకం అని, రాష్ట్రంలో అవసరం ఉన్న అందరికీ కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించి, పరీక్షల తో పాటు ఉచితంగా, మందులు, కళ్లద్దాలు ఉచితంగా ఇస్తున్నాం. ప్రతి కళ్ళ అద్దాల జోడులకు బార్ కోడ్ కూడా పెడుతున్నాం అని, ఎవరివి వారికే చేరేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం.

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపులు నిర్వహణ ఉంటుంది అని, మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 8 మంది వైద్య సిబ్బంది ఉంటారు. ఒక అప్టో మెట్రిస్ట్, ఒక సూపర్ వైజర్, ఇద్దరు ఏ ఎన్ ఎం, ముగ్గురు ఆశా, 1 డీఈవో టీంలో సభ్యులుగా ఉంటారు అని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం సిబ్బంది, మాధవ్, రమణ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS