SAKSHITHA NEWS

ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం ఉంది. భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి.

గత 24 గంటల్లో రూ.8.65 కోట్ల విలువైన మద్యం , నగదును స్వాధీనం చేసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు.

ఏపీలో రూ.165.91 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.91.26 కోట్ల విలువైన 14,73,734.46 గ్రాముల ప్రెషస్ మెటల్, రూ.36.89 కోట్లు నగదు, రూ.20.32 కోట్ల విలువైన 6,62,402.65 లీటర్ల లిక్కర్, రూ.11.74 కోట్ల విలువైన 11,27,451.07 ఇతర వస్తువులు సీజ్ చేశారు.

రూ. 165.91 కోట్లలో అత్యధికంగా రూ.30.66 కోట్లు అనంతపూర్ పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి పట్టుబడింది. అత్యల్పంగా రూ.1.15 కోట్లు నర్సాపురం పార్లమెంటరీ నియోజక వర్గంలో స్వాధీనం చేసుకున్నారు.

అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతోపాటు రాష్ట్రంలోని చెక్ పోస్టుల ద్వారా తనిఖీలు చేపట్టారు. పోలీసులతో పాటు ఎక్సైజ్, ఇన్-కమ్ ట్యాక్స్, ఫారెస్ట్, ఈడీ, ఎన్సీబీ, ఆర్పీఎఫ్, కస్టమ్స్ 20 ఏజెన్సీలు కలిపి తనిఖీలు చేపట్టాయి.

WhatsApp Image 2024 04 26 at 12.29.46 PM

SAKSHITHA NEWS