ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్?
హైదరాబాద్:
రాష్ట్రంలో బిఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. పథకాల్లో కోతలు, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తున్న ప్రధాన ప్రతిక్ష నేతలను ముందస్తు అరెస్టులతో నిర్బంధిస్తున్నది.
ఈ క్రమంలో హుజూరా బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని,పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తెల్లవారుజామునే కొండాపూర్‌లోని ఆయన నివాసానికి పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
జిమ్‌కు వెళ్తున్న ఆయనను అడ్డుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి నిరాకరించారు.
అదేవిధంగా బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం. విద్యాసాగర్‌ను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఆయనతోపాటు సుమారు వంద మంది బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ మరికాసేట్లో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈనేపథ్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటు న్నారు.
కాగా, అక్రమ అరెస్టులపై పార్టీ నేతలు మండిపడు తున్నారు. ప్రజాప్రభుత్వ మని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, విపక్ష నేతలను అడుగడుగునా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.