SAKSHITHA NEWS

సర్వజ్ఞలో హోలీ వేడుక

స్థానిక వీడియోస్ కాలనీలో గల సర్వజ్ఞ పాఠశాలలో హోలీ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ వేడుకలో చిన్నారులు ఒకరికి ఒకరు సహజసిద్ధమైన రంగులను పూసుకొని సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు రంగులు చల్లుకొని సందడి చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కె నీలిమ మాట్లాడుతూ ప్రకృతిలో ఎన్నో రంగులు ఉన్నాయని, మన జీవన విధానం కూడా రంగులతో మమేకమై ఉంది అని ప్రకృతిలో రంగులన్నీ జీవిత తత్వాన్ని బోధిస్తాయని తెలిపారు. హోలీ అనేది ప్రముఖమైన మరియు ముఖ్యమైన హిందూ పండుగని, దీనిని రంగులు పూర్ణిమ మరియు వసంతాల పండుగగా జరుపుకుంటారు అని తెలియజేశారు. ఇది భారతదేశంలో ముఖ్యమైన పండుగలలో ఒకటి అని వివరించారు. హోలీని స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారని తెలియజేశారు. కుల,మత, వర్గ వేదాలకు అతీతంగా చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా పాల్గొన్న పౌర్ణమి నాడు జరుపుకునే వేడుక హోలీ అని పాఠశాల డైరెక్టర్ రాజా వాసిరెడ్డి నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు.
హోలీని హోలీకా పూర్ణిమ గా కూడా వ్యవహరిస్తారని వివరించారు. హోలీ పండుగ వేళ తగిన జాగ్రత్తలు పాటించడం అవసరమని సూచించారు, అతి సున్నితమైన కళ్ళను కాపాడుకోవాలంటే రసాయనాలతో చేసిన రంగుల కంటే సేంద్రీయ రంగులు వాడటం మేలు అని తెలియజేశారు. హోలీలో సహజ సిద్ధమైన రంగులు మాత్రమే వాడాలని రసాయన మిలత మైన రంగులు వాడి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నీలిమ, ఆర్ వి నాగేంద్ర కుమార్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పరిపాలన,బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Image 2024 03 23 at 4.15.11 PM

SAKSHITHA NEWS