SAKSHITHA NEWS

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఫలితంగా ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వానలతో దక్షిణ తమిళనాడుకు చెందిన తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి..

ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలడంతో తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను స్టాలిన్‌ ఆదేశించారు..


SAKSHITHA NEWS