సుదర్శన క్రియతో ఆరోగ్యం మెరుగవుతుంది – పల్లపు బుద్ధుడు

Spread the love

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంగ్ సుదర్శన క్రియ ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ నితీష్ మరియు కిషోర్ లు సాధన ఆసనాలు వేసి నేర్పించడం జరిగింది.

వామప్, సూర్య నమస్కారాలు, పద్మాసనాలు, ప్రాణయామ మరియు సుదర్శన క్రియ కార్యక్రమాలు టీచర్లచే నేర్పించడం జరిగింది. ఈ క్రియల ద్వారా మనలోని శ్వాస ప్రక్రియ ఎంతో ఉత్సాహంగా ప్రశాంతంగా తీసుకోవడానికి వీలు కల్పిస్తూ ఈ యొక్క లాంగ్ సుదర్శన క్రియ ఏర్పాటు చేయబడిందని తెలియజేశారు. ఈ సుదర్శన క్రియ ద్వారా ఎంతోమంది తమ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందగలిగారని ప్రతి మనిషి మొదట తన శరీరాన్ని ప్రేమించాలని తద్వారా శరీరం మనసు సర్వీసింగ్ చేయడానికి ఏకైక సాధన సుదర్శన క్రియ ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.

ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఉండాలంటే సుదర్శన క్రియ తప్పనిసరి చేయాలన్నారు. నిత్యజీవితంలో సాధన, సేవ, సత్సంగ్ కార్యక్రమాలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పొట్లపల్లి నరసింహ గౌడ్, నీలకంఠం నరేష్, నాగచారి, చంద్రయ్య, ఆనగంటి లింగస్వామి, మోర ధనుంజయ్, ఆవుల జానయ్య, గుండెబోయిన నరసింహ, మర్రి హరీష్ రెడ్డి, వెంకటేష్, పామన గుండ్ల వెంకన్న, పాకాల సత్యనారాయణ, రాచమల్ల శ్రీనివాస్, సిలివేరు వెంకటేష్, పల్లపు వెంకటేష్, పల్లపు సాయి తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page