జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం – ఎమ్మెల్యే కొడాలి నాని
-బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని…. ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే నాని…
-‘అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటాలు మర్చిపోలేనివి….
-మహానీయులైన బాబు జగ్జీవన్ రామ్….. భారతరత్న బిఆర్ అంబేద్కర్ ఆశయాల కనుగుణంగానే సీఎం జగన్ పాలన సాగుతుంది…
గుడివాడ05:గుడివాడ పట్టణం 28వ వార్డులో నిర్వహించిన భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే కొడాలి నాని నివాళులర్పించి….. జోహార్ జగ్జీవన్ రామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ దేశానికి దశా దిశా నిర్దేశించిన జగ్జీవన్ రామ్ సేవలను…. దేశ ప్రజలు ఎన్నటికీ మరువరన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయక మన్నరు…
.. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కొడాలి నాని అన్నారు. జగ్జీవన్ రామ్…. అంబేద్కర్ లాంటి మహనీయుల ఆశయాలను కొనసాగించేలా సీఎం జగన్ పాలన సాగుతుందని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రేమల్లి నీలాకాంత్,సీనియర్ నాయకులు పాలేటి చంటి,బూసి ప్రకాశరావు, వెంపటి సైమన్, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి, కొర్ని పాటి గణపతి, యువత రాష్ట్ర కార్యదర్శి అద్దేపల్లి పురుషోత్తం,ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేండా చంద్రాపాల్, వైయస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు తులిమిల్లి యషయ్య,వికలాంగుల విభాగ రీజినల్ కో ఆర్డినేటర్ దొండపాటి మదుకిరణ్, వైఎస్ఆర్సిపి నాయకులు, దళిత సంఘాల పెద్దలు పాల్గొన్నారు.