SAKSHITHA NEWS

జిల్లాలో గ్రూప్ త్రి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన………… జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

సాక్షిత వనపర్తి నవంబర్ 12

 గ్రూప్ 3 పరీక్షలను జిల్లాలో అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు డిపార్ట్మెంటల్ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
    మంగళవారం ఐడిఓసి సమావేశ మందిరంలో నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్న  గ్రూప్ 3   పరీక్షల నిర్వహణకు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్,  రూట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ లను నియమించి   అధికారులకు వారి బాధ్యతలపై అవగాహన కల్పించారు.
 వనపర్తి జిల్లాలో మొత్తం 8312 మంది విద్యార్థులు గ్రూప్ 3 పరీక్షలు రాయనున్నారు. వీరికి వనపర్తి, కొత్తకోటలో కలిపి 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 
 ఎన్నికల నిర్వహణ మాదిరిగానే గ్రూప్ 3 పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు జాగ్రత్తగా తమ విధులు నిర్వహించాలని, ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన, నిబంధనలు అతిక్రమించిన చర్యలు కఠినంగా ఉంటాయనీ హెచ్చరించారు. 

ప్రతి సెంటరుకు ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ను, నియమించడం జరిగిందని, వారు చీఫ్ సూపరింటెండెంట్, రూట్ ఆఫీసర్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ తో సమన్వయం చేసుకుంటూ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.
ముందుగానే పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చూసుకొని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పరీక్ష కేంద్రంలోని ఒక్కో రూమ్ లో విద్యార్థులను ఏ విధంగా కూర్చోబెట్టాలి అనేది ముందుగానే సూక్ష్మ ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. పరీక్ష రోజున డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ తో పాటు ఏ ఒక్క వ్యక్తి మొబైల్ ఫోన్ తో పరీక్షా కేంద్రంలోకి వెళ్ళడానికి వీలు లేదని తెలిపారు. కేవలం చీఫ్ సూపరింటెండెంట్ కు మాత్రమే అనుమతి ఉంటుందని అదికూడా ఛాంబర్ దాటి బయటికి తీసుకెళ్ళడానికి వీలు లేదన్నారు. ప్రతి ఇన్విజిలేటర్ తో పాటు విద్యార్థులు ప్రతి ఒక్కరినీ చెక్ చేసి పంపించాలని ఆదేశించారు.
నవంబర్ 17 న ఉదయం 10 గంటల నుండి 12.30 వరకు జరిగే పరీక్షకు విద్యార్థులను ఉదయం 8.30 నుండి 9.30 వరకు అనుమతించాలని, 9.30 తర్వాత వచ్చే విద్యార్థులకు అనుమతి లేదన్నారు. అదే మధ్యాహ్నం పరీక్ష 3 నుండి 5.30 వరకు నిర్వహించడం జరుగుతుందనీ వీరికి మధ్యాహ్నం 2.30 తర్వాత అనుమతి లేదన్నారు.
పరీక్షా కేంద్రానికి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా తన ఒక గుర్తింపు కార్డును (ఒరిజినల్ ) తీసుకొని రావాల్సి ఉంటుందని ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు విద్యార్థి అతనేనా కాదా అనేది ధృవీకరించుకొని లోపలికి పంపించాలన్నారు. ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్ళడానికి అనుమతి లేదని సూచించారు.
పరీక్ష సమయం పూర్తి అయ్యాక మాత్రమే ఒ.యం.ఆర్ షీట్ తీసుకొని విద్యార్థిని బయటికి పంపించాలని, పరీక్ష జరుగుతుండగా మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బయటికి వదలడం జరగొద్దని సూచించారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ లు పరీక్ష జరుగుతున్న సమయంలో ఆకస్మిక తనిఖీకి నిర్వహిస్తూ పరీక్షలు సజావుగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రూట్ ఆఫీసర్లు కేటాయించిన రూట్ ల వారీగా సమయానికి ప్రశ్న పత్రాలు, ఒ.యం.ఆర్ షీట్ లు పరీక్ష కేంద్రాలకు తరలించడం, పరీక్ష పూర్తి కాగానే భద్రంగా స్ట్రాంగ్ రూమ్ కు తరలించే బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్, పరీక్షల నోడల్ అధికారి సంచిత్ గంగ్వార్, రీజినల్ కోడినేటర్ రామ్ నరేష్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

WhatsApp Image 2024 11 12 at 4.30.37 PM

SAKSHITHA NEWS