
విద్యావంతుడు, కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముచ్చటగా మూడవసారి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించినందుకు గాను కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు వారి కర్తవ్యాన్ని అంకితభావంతో నిర్వహించినట్లయితే ప్రజల మద్దతు ఎల్లవేళలా ఉంటుందనడానికి నిదర్శనం కుత్బుల్లాపూర్ ప్రజలు నాకు అందించిన ఏ అఖండ మెజార్టీయేనన్నారు.
