విజ్ఞాన్ విద్యాలయ స్కూల్ NCC నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్, కమీషనర్
ఆకుపచ్చని ఆవరణం కోసం పసిడి పచ్చని రాష్ట్రం కోసం
చెట్లను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 14వ డివిజన్ లో విజ్ఞాన్ విద్యాలయ స్కూల్ NCC నేషనల్ క్యాడెట్ కార్ప్స్ విద్యార్థులు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, కమీషనర్ రామకృష్ణ రావు గారు, స్థానిక కార్పొరేటర్ రాజేశ్వరి వెంగయ్య చౌదరి గారు , విజ్ఞాన్ విద్యాలయ స్కూల్ వైస్ చైర్మన్ రాణి రుద్రమ దేవి గారు,నేషనల్ క్యాడెట్ కార్ప్స్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. అనంతరం విజ్ఞాన్ విద్యాలయ స్కూల్ NCC నేషనల్ క్యాడెట్ కార్ప్స్ విద్యార్థులు ముఖ్య అతిధులను ఘన స్వాగతం పలుకుతూ ఘనంగా సన్మానించారు. డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాలి అని సూచించారు . అలాగే విజ్ఞాన్ విద్యాలయ యాజమాన్యం ఆచారి కుంట రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటి,ఆచారి కుంట ను విజ్ఞాన్ విద్యాలయ స్కూల్ యాజమాన్యం వారు సుందరీకరణ , అభివృద్ధి మరియు మెయింటెనెన్స్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పద్మజ, శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరి, స్థానికులు దత్తు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు..