డిప్యూటీ మేయర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ క్రైస్తవ పాస్టర్లు
డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ క్రైస్తవ పాస్టర్లు డిప్యూటీ మేయర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాస్టర్లు పుచ్చకాయల జాషువా,రమేష్, జాదిక్ కుమార్, ఎమ్. జాషువా, ఈఎమ్. చారీ, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు