ఎంపీ అరుణ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ అరుణమ్మకు మహబూబ్ నగర్ వారి స్వగృహంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఎంపీ అరుణమ్మ షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఎంపీ అరుణమ్మ మాట్లాడుతూ
రేపటిలోగా 50 శాతం పోలింగ్ బూత్ కమిటీలు పూర్తి చేసి జిల్లా పార్టీకీ అందించి మండల కమిటీ లు వేడుకోవాలని అన్నారు. అరుణమ్మ కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, విజయ్ బాస్కర్, మోహన్ సింగ్, పసుల నర్సింహా యాదవ్, శివారెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, చేగు సుధాకర్, మల్ రెడ్డి మహేందర్ రెడ్డి, అత్తాపురం మహేందర్ రెడ్డి, కృష్ణ, గడ్డమీది రాజు, ఇంద్ర సేన రెడ్డి, బాల్ రెడ్డి, పాండు రంగా రెడ్డి, వన్నం శ్రీనివాస్,చౌడం శ్రీనివాస్, కల్వకొలు తిరుపతి,తదితరులు ఉన్నారు..